AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. టీ20ల్లో ఏకైక ప్లేయర్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తాజాగా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 200 సిక్సులు బాదిన ఏకైక క్రికెటర్‌గా చరిత్రపుటలకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్‌లోని (T20 World Cup) సూపర్-8లో భాగంగా.. ఆస్ట్రేలియాతో (Australia) జరిగిన మ్యాచ్‌లో అతను ఈ సంచలన రికార్డ్‌ను నెలకొల్పాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ సిక్సుల వర్షం కురిపించడంతో.. 200 మైలురాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో ఏ ఇతర ఆటగాడు కూడా అతని దరిదాపుల్లో లేడు.

రోహిత్ శర్మ తర్వాత న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్ 173 సిక్సులతో రెండో స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత జాస్ బట్లర్ (ఇంగ్లండ్), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా), నారంగ్ పూరన్ (వెస్టిండీస్), సూర్యకుమార్ యాదవ్ (ఇండియా) వరుసగా 137, 133, 132, 129 సిక్సులతో మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. చూస్తుంటే.. ఇతర ఆటగాళ్లకు రోహిత్ రికార్డ్‌ని అందుకోవడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదని తెలుస్తోంది. గుప్తిల్ ఎప్పుడో క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు కాబట్టి.. ఈ రేసులో అతను లేడు. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న వాళ్లందరూ చాలా దూరంలో ఉన్నారు. ఈ లెక్కన.. రోహిత్‌ని దాటడం కొన్ని సంవత్సరాల సమయం పట్టొచ్చు.

కాగా.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో రికార్డ్ ఫీట్‌ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 19 బంతుల్లోనే అర్థశతకం చేసి.. తన కెరీర్‌లో ఫాస్టెస్ట్ అర్థశతకాన్ని నమోదు చేశాడు. ఐదో ఓవర్‌లో పాట్ కమిన్స్ వేసిన చివరి బంతికి సింగిల్ తీసి.. అతను హాఫ్ సెంచరీ మార్కుని చేరుకున్నాడు. దీంతో.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన భారతీయ ఆటగాళ్లలో రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. అగ్రస్థానంలో యువరాజ్ సింగ్ (Yuvraj Singh) (12 బంతుల్లో) ఉండగా.. రెండో స్థానంలో కేఎల్ రాహుల్ (KL Rahul) (18 బంతుల్లో) ఉన్నాడు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10