AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌

బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలింది. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే డాకర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడి సమక్షంలో సంజయ్ అధికార కాంగ్రెస్ పార్టీకి గూటికీ చేరారు. జూబీహిల్స్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే సంజయ్ కు కండువా కప్పి సీఎం రేవంత్ రెడి పార్టీలోకి ఆహ్వానించారు.

ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన సీఎం రేవంత్ రెడ్డి.. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టారు. బీఆర్ఎస్ ఎల్సీ విలీనమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడి యాక్షన్ సార్ట్‌ చేసినట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నటు టాక్. రెండు రోజుల గ్యాప్ లోనే ఇద్దరు ఎమ్మెల్యేలను చేజార్చుకున్న బీఆర్ఎస్‌కు నెక్ట్స్ ఎవరు వెళ్తారోనని టెన్షన్ పట్టుకుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10