AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీతారామ పంప్ హౌస్ ట్రయల్ రన్.. గోదారమ్మ పరవళ్లకు పరవశించిన మంత్రి తుమ్మల..

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి వరప్రదాయని అయిన.. సీతారామ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది.. ట్రయల్ రన్ కూడా పూర్తయింది.. ఆగస్టు 15 నాటికి సాగర్ లింక్ కెనాల్ కు అనుసంధానించి గోదావరి జలాలు అందించేందుకు సర్వం సిద్ధమైంది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో సీతారామ ప్రాజెక్ట్ మొదటి పంప్ హౌస్ వద్ద ట్రయల్ రన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. గోదావరి జలాలు పరవళ్ళు తొక్కుతుండటంతో ఆయన ఒక్కసారిగా పరవశించిపోయారు.

ఆనందంతో భూమాతకు సమస్కరించారు మంత్రి తుమ్మల.. త్వరగా పనులు పూర్తి చేసి నీటిని అందించాలంటూ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వడమే తన చివరి కోరిక అన్నారు మంత్రి మంత్రి తుమ్మల. గోదావరి జిల్లాల మాదిరిగా ఖమ్మం జిల్లాలో సాగు ఇవ్వాలన్నది తన కోరికగా చెప్పారు. సీతారామ ప్రాజెక్ట్‌కు భూమి ఇచ్చిన వారికి పాదాభివందనాలు తెలిపిన తుమ్మల..అధికారులు రేయింబవళ్ళు కష్టపడ్డారరని అభినందించారు. ఈ వర్షాకాలంలోనే లక్షన్నర ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

బుధవారం అర్ధరాత్రి సీతారామ ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్ వద్ద ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు. గత ఇరవై రోజులుగా ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 15 లోగా సాగర్ లింక్ కెనాల్‌కు గోదావరి జలాలు అందించి.. వైరా రిజర్వాయర్‌కు అనుసంధానం చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10