AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎండలో బయటకు వెళ్తున్నారా? అయితే ఇది మీ కోసమే..

లైట్ తీసుకుంటే ప్రాణాల‌కే ప్ర‌మాదం
ఎండాకాలం వ‌చ్చిందంటే చాలు భానుడు ఉగ్ర‌రూపం దాల్చుతాడు. వేస‌వికాలంలో ప్ర‌తిఒక్క‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే.. లైట్ తీసుకుంటే ప్రాణాల‌కే ముప్పు వాటిల్లే ప్ర‌మాదం ఉంది. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు…
1 సాధ్య‌మైనంత వ‌ర‌కు చ‌ల్ల‌ని ప్ర‌దేశాల్లో ఉండాలి
2 వదులైన‌, ప‌లుచ‌ని కాట‌న్ దుస్తులు ధ‌రించాలి
3 త‌ల‌కు టోపీ లాంటివి పెట్టుకోవాలి
4 మిట్ట మ‌ధ్యాహ్నం 12 నుంచి 3 గంట‌ల మ‌ధ్య‌లో ప్ర‌యాణాలు లేకుండా జాగ్ర‌త్త‌ప‌డాలి.
5 నీటిని ఎక్కువ‌గా తాగడంతోపాటు మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం మంచింది.
6 కొబ్బ‌రిబోండం నీళ్లు తాగాలి.
7 వ‌డ‌దెబ్బ‌కు గురైన వ్య‌క్తికి చ‌ల్ల‌ని గాలి అందేలా చూడాలి. దుస్తులు వ‌దులు చేయాలి.
8 వ‌డ‌దెబ్బ‌కు గురైన వ్య‌క్తి శ‌రీరాన్ని త‌డిబ‌ట్ట‌తో తుడ‌వాలి.
9 కోలుకోక‌పోతే బాధితుడిని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లాలి.

జాగ్ర‌త్త‌లు…
1 తీవ్ర‌మైన ఎండ‌లో ఎక్కువ సేపు నిల్చోవ‌డం, వేడి గాలికి తిర‌గ‌డం లాంటివి చేయ‌కూడ‌దు.
2 గొడుగు లేకుండా బ‌య‌ట‌కు వెళ్ల‌డం మంచిది కాదు.
3 న‌లుపురంగు దుస్తులు, మందంగా ఉన్న దుస్తులు ధ‌రించ‌డం చేయ‌రాదు.
4 గ‌దిలోకి వేడిగాలి నేరుగా వ‌చ్చేలా వ‌దిలేయ‌డం.
5 టీ, కాఫీలు ఎక్కువ‌గా తీసుకోవ‌డం మంచిది కాదు.
6 చికెన్, గుడ్లు మోతాదుకు మించి తీసుకోక‌పోవ‌డం మంచిది.
7 కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీంలు, జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10