AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త్వరితగతిన ట్రాక్‌ను సిద్ధం చేయాలి.. కేసముద్రం సెక్షన్‌ పనులను పరిశీలించిన జీఎం

వర్షాలకు దెబ్బతిన్న మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె సెక్షన్‌లో ట్రాక్‌ను సిద్ధం చేయాలని సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ ఆదేశించారు. కేసముద్రం, ఇంటికన్నె వద్ద జరుగుతున్న ట్రాక్‌ మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేసముద్రం సెక్షన్‌లోని 418-432 కిలోమీటర్ల మధ్య వరద పొంగడంతో ఆదివారం ట్రాక్‌ దెబ్బతిన్నది.

సోమవారం క్షేత్రస్థాయిలో ఆయన మరమ్మతు పనులను సమీక్షించి.. సిబ్బందికి సూచనలు చేశారు. వీలైనంత త్వరగా ట్రాక్‌ని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. సెక్షన్‌ పరిధిలో ఐదు ప్రాంతాల్లో ట్రాక్‌కు నష్టం జరిగింది. ఇందులో నాలుగు ప్రాంతాలకు మరమ్మతులు చేయగా.. చివరగా ప్రధానంగా దెబ్బతిన్న ప్రాంతంలో పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టాలని.. ట్రాక్‌ను రెడీ చేసి రాకపోకలు ప్రారంభించాలని సూచించారు. ఆయన వెంట ఎస్‌సీఆర్‌ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ డీ మిశ్రా, చీఫ్‌ ఇంజినీర్‌ ఎస్‌ బ్రహ్మానందం, ప్రిన్సిపల్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ వివేకానంద్‌ ఉన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10