AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా మేం గడీల్లో పడుకోలేదు.. డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసి, లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్న తరుణంలో బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ‘రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితం. కేటీఆర్, హరీశ్ రావులు.. రాజకీయంగా సోషల్ మీడియాలోనే బతికేస్తున్నారు. బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా మేం గడీల్లో పడుకోలేదు. ప్రజల మధ్యన ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వం హై అలర్ట్ గా ఉన్నందునే స్వల్ప ప్రాణ నష్టం కూడా జరగలేదు. బీఆర్ఎస్ పాలనలో కొద్దిపాటి వర్షానికి హైదరాబాద్ మునిగిపోయేది.. జంట నగరాల్లో వరద విపత్తును ఎదుర్కోవడానికి హైడ్ ను సిద్ధం చేశాం. నిరాశ్రయులకు తక్షణమే నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నాం. వరద ఉధృతి తగ్గిన తర్వాత నష్టం అంచనా వేయించి బాధితులను ఆదుకుంటాం. సీజనల్ వ్యాధులు రాకుండా వైద్య ఆరోగ్యశాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నది. విపత్కర సమయంలో అర్ధరాత్రి కూడా పనిచేస్తూ విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూస్తున్న విద్యుత్ సిబ్బందికి, సేవలు చేస్తున్న పోలీస్ శాఖ కు నా అభినందనలు తెలియజేస్తున్నాను’ అంటూ భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు.

 

ఇదిలా ఉంటే.. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మున్నేరు పరివాహక ప్రాంతంలో ఇంత భారీ స్థాయిలో వరదను ఇదివరకెప్పుడూ నేను చూడలేదు. వరదలకు రూ. వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ సాయం కోరుదామని చెప్పారు. ప్రతిపక్షాలు చేతనైతే మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలి. కానీ, ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం సరికాదు’ అంటూ పొంగులేటి పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10