AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మొన్న ప్రజ్వల్ రేవణ్ణ.. నేడు సూరజ్ రేవణ్ణ.. కుటుంబం మొత్తం లైంగిక వేధింపులే

కుటుంబంలో ఎవరో ఒకరు తప్పుడు మార్గంలో వెళ్లడం అక్కడక్కడా చూస్తుంటాం.. కానీ ఆ ఫ్యామిలీలో తండ్రిని ఆదర్శంగా తీసుకున్నారో ఏమో కానీ కుటుంబం మొత్తం అదే దారిలో నడించింది. తమ అధికారం అడ్డంపెట్టుకుని అమాయకులను, బలహీనులను లైంగికంగా వేధించారు. ఇంట్లో పనిమనిషిని తండ్రి వేధిస్తే.. చిన్న కొడుకు ఇంకో అడుగు ముందుకేసి ఆ పనిమనిషితో పాటు ఆమె కూతురును కూడా వేధించాడు. తాము ఎన్నుకున్న ఎమ్మెల్యేనే కదా.. తమ సమస్యలు తీర్చుతాడనే ఉద్దేశంతో వచ్చిన మహిళలను లైంగికంగా వేధించి, వాటిని వీడియోలు తీసి దాచుకున్నాడు.

తండ్రీ, తమ్ముడిని ఆదర్శంగా తీసుకున్న పెద్ద కొడుకు ఇంకో నాలుగైదు అడుగులు ముందుకేసి ఏకంగా ఓ యువకుడిని లైంగికంగా వేధించాడు. ఆ యువకుడు కేసు పెట్టడంతో కటకటాల పాలయ్యాడు. ఇదీ కర్ణాటకలోని రేవణ్ణ ఫ్యామిలీ కథ. తండ్రి రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు రాగా.. చిన్న కొడుకు, మాజీ ఎమ్మెల్యే ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇప్పుడు తమ్ముడికి తోడుగా అన్న, మాజీ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ కూడా జైలుకు వెళ్లాడు.

సూరజ్ పై కేసు ఇదీ..
జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) నేత, మాజీ ఎమ్మెల్సీ అయిన సూరజ్ రేవణ్ణ ఈ నెల 16న తనను లైంగికంగా వేధించాడని ఆ పార్టీ కార్యకర్త ఒకరు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హసన్ జిల్లాలోని వారి కుటుంబానికి చెందిన ఫాంహౌస్ లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పాడు. అయితే, ఈ ఆరోపణలను సూరజ్ రేవణ్ణ తోసిపుచ్చాడు. సదరు యువకుడు రూ.5 కోట్లు ఇవ్వాలని తనను బెదిరించాడని, తాను ఇవ్వకపోవడం వల్లే ఈ తప్పుడు కేసు పెట్టాడని ఆరోపించాడు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10