AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మీ కష్టం తీరుస్తా.. ఎంత సాయమైనా చేస్తా.. సీఎం రేవంత్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

ఖమ్మం జిల్లాలో ఎక్కడ చూసినా కన్నీటి వ్యథలే..

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఎంత సాయం చేయడానికైనా వెనుకాడని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమైంది. భారీ వర్షాలకు వరదలు సంభవించాయి. మరోవైపు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ప్రళయం సృష్టించింది. ఈ వరదలకు కొంతమంది మృత్యువాత పడగా.. జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో 30 కి పైగా కాలనీలు నీటమునిగాయి. ఈ పరిస్థితులపై మొదట అధికారులతో సమావేశమైన సీఎం.. అనంతరం నేరుగా రోడ్డు మార్గంలో ఖమ్మంలో పర్యటించారు. ఈ మేరకు అక్కడి బాధితుల పరిస్థితులపై సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

ఖమ్మంలో ఎటుచూసిన గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే కష్టాలు కనిపించాయని చెప్పారు. వరద నీటిలో మునిగిపోవడంతో ఇంట్లోని వస్తువులు పాడైపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. నేను అక్కడ కష్టాలను స్వయంగా చూశానని చెప్పుకొచ్చారు. అలాగే బాధితుల మొఖాలలో ఓ వైపు తీరని ఆవేదన, మరోవైపు అన్న వచ్చాడన్న భరోసా కనిపించిందన్నారు. వారి కష్టాలను స్వయంగా చూశానని అన్నారు. వీళ్ల కష్టం తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి తెంగాణ ప్రభుత్వం ఎంతటి సాయమైనా చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. వీళ్ల కష్టం తీర్చడానికి ఎంతటి సాయమైనా చేస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10