AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జమిలికి జై.. కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఇకపై ఒకేసారి..

కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ బుధవారం మధ్యాహ్నం ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది.

కేంద్ర సర్కార్ వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ ప్రతిపాదన కోసం రామ్‌నాథ్‌ కోవింద్‌‌ సహా 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై కమిటీ సభ్యులతో రామ్‌నాథ్ కోవింద్ చర్చించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలను, రాష్ట్రాల సవాళ్లను కమిటీ పరిశీలించింది.

సుదీర్ఘ చర్చోపచర్చల అనంతరం రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికల ప్రతిపాదన 1980లో వచ్చింది. జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ మే 1999లో తన 170వ నివేదికలో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని అభిప్రాయపడింది. అందుకు తగినట్లే కేంద్రంలోని బీజేపీ సర్కార్ అధ్యయనానికి కమిటీ వేసి.. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10