AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీసీలను వంచించింది మీ దండుపాళ్యం బ్యాచే.. కేటీఆర్ పై భగ్గుమన్న టిపిసిసి జనరల్ సెక్రటరీ సత్తు మల్లేష్

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించింది మీరు కాదా?

తొమ్మిదిన్నరేళ్ళ మీ పాలనలో బీసీలకు ఏం న్యాయం చేశారు?

మరోసారి వంచనకే లైన్లు.. డెడ్ లైన్ డ్రామాలు

రేవంతన్న నాయకత్వంలోనే బీసీలకు న్యాయం

బీసీల కష్టాలు కన్నీళ్ళు తెలిసిన నాయకుడు సీఎంగా ఉండడం అద్రుష్టం

(హైదరాబాద్, అమ్మన్యూస్ )
బీసీలను వంచించింది మీ దండుపాళ్యం బ్యాచ్ కాదా కేటీఆర్? అంటూ టిపిసిసి జనరల్ సెక్రటరీ సత్తు మల్లేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బిసి రిజర్వేషన్లపై కేటీఆర్ డెడ్ లైన్లు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ మరో పెద్ద జోక్ వేశాడు. బీసీ జనగణన నవంబర్ 10 లోపు పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీకే డెడ్ లైన్ విధించాడట. ఇలాంటి మాటలు మాట్లాడడానికి కేటీఆర్ కి కొంచెమైనా సిగ్గుండాలి. బీసీల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు ఎవరికీ లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించిన మీరు ఈరోజు బీసీల గురించి మొసలి కన్నీళ్లు కార్చడం విడ్డూరంగా ఉంది. గత పదేళ్ల మీ పాలనలో బీసీలకు ఏం చేశారో చెప్పే ధైర్యం ఉందా? అంటూ భగ్గుమన్నారు.

వర్షాలు వచ్చి వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందిపడుతుంటే అమెరికా పోయి ఎంజాయ్ చేసివచ్చిన కేటీఆర్ రాజకీయం దోపిడీ తప్ప ప్రజల బాధలు ఏనాడూ పట్టించుకోలేదన్నారు. ఆ పార్టీ నేతలతో మీటింగ్ పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ 10లోగా బిసి కులగణన పూర్తిచేయాలని డెడ్ లైన్ పెట్టిండని పత్రికల్లో చూసిన. కేటీఆర్.. మీకు సిగ్గులజ్జ శరం ఉంటే మీకే కావొచ్చు మీ అయ్యకే కావొచ్చు..మీ బావ అగ్గిపెట్టె హరీష్ రావుకే కావొచ్చు బిసిల గురించి మాట్లాడే అర్హత లేదు. తొమ్మిదిన్నరేళ్ళ మీ పాలనలో బిసి రిజర్వేషన్లు తగ్గించింది మీ అయ్య దుర్మార్గుడు కాదా? ఈ రోజు 42శాతం బిసిరిజర్వేషన్లు పెంచాలంటున్నవు. ఆ నాడే 42శాతం పెంచి ఉంటే ఈ డిమాండ్ డెడ్ లైన్లు చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతన్న నాయకత్వం బిసిల పక్షపాతి. బిసిల కష్టాలు కన్నీళ్ళు తుడవడం మాకు తెలుసు. బిసిల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉంది. బీసీలకు మీ దండుపాళ్ళం బ్యాచ్ ఏం చేసింది? ఇప్పటికైనా ఈ లెక్చర్లు ఇచ్చుడు బంద్ చేయండి.. మీరు చేసిన తప్పలకు చెంపలు వేసుకోండి అంటూ సత్తుమల్లేష్ హితవుపలికారు. బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10