AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ సాంగ్ లో కెసిఆర్ డైలాగ్ – భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు

డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి రిలీజ్ అయిన మార్ ముంత చోడ్ చింత సాంగ్ పెద్ద వివాదంలో చిక్కు కుంది . పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమా తెరకెక్కుతోంది. ఆగస్టు నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు పెట్టింది.

ఈ సినిమా యూనిట్ అందులో భాగంగానే మార్ ముంత చోడ్ చింత అనే ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అందులో కేసీఆర్ పలికిన ఏం చేద్దాం అంటావు మరి అనే ఒక డైలాగ్ ని ఈ పాటలో హుక్ లైన్ గా వాడారు.

ఈ విషయం మీద ఇప్పటికే బీఆర్ఎస్ సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. ఇక తాజాగా ఎల్బీనగర్ డీఎస్పీకి పూరీ జగన్నాథ్ మీద చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

డబల్ ఇస్మార్ట్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో కేసీఆర్ డైలాగునిగా వాడుకున్నారు. ఇది చాలా అభ్యంతరకరమైన విషయం. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. మా ప్రాంత యాస భాషలను కించపరిచే విధంగా మా బీఆర్ఎస్ నాయకుడిని కించపరిచే విధంగా ఉన్న ఈ పాటను మార్చాలి లేకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని తెలియజేస్తూ ఆ డైలాగును సాంగ్ నుంచి రిమూవ్ చేయాల్సిందిగా కోరుతున్నామంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10